‘రోబో’ తర్వాత తలైవర్ ప్రయోగం.. రజినీ కూతురు ఎమోషనల్ పోస్ట్ వైరల్!

‘రోబో’ తర్వాత తలైవర్ ప్రయోగం.. రజినీ కూతురు ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Published on Feb 18, 2026 1:28 AM IST

Kochadaiyan

సూపర్ స్టార్ రజినీ కాంత్ ఎంత పెద్ద స్టార్ అనేది ఇండియన్ సినిమా ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఉన్న పాన్ ఇండియా ఇతర దేశాల్లో మార్కెట్ లు లాంటివి తాను దశాబ్దంన్నర కితమే చూసేసారు. సో తనకి ఇప్పుడు ఉన్న లెక్కలు, హైప్ అంతా తన ముందు జుజుబీనే అన్నట్టు ఉంటుంది. అయితే పాన్ ఇండియా లెవెల్లో రజినీకాంత్ ఊహించని సంచలనం సెట్ చేసిన సినిమా ‘రోబో’.

మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం 2010 లోనే 4000 వేలకి పైగా స్క్రీన్స్ లో విడుదల అయ్యి పాన్ ఇండియా మార్కెట్ లో కొత్త ఒరవడి సృష్టించింది. మరి అలాంటి భారీ హిట్ తర్వాత రజినీకాంత్ నుంచి మరో ప్రయోగాత్మక సినిమాగా మంచు హైప్ ని క్రియేట్ చేసి వచ్చిన చిత్రమే ‘కొచ్చాడియాన్’.

తన కూతురు సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ‘అవతార్’ సినిమా టెక్నాలజీతో తెరకెక్కింది అంటూ ప్రమోట్ చేసి విడుదలకి వచ్చింది. తెలుగులో కూడా ‘విక్రమసింహ’గా కూడా విడుదల అయ్యింది. కానీ ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. అంత హైప్ లో వెళితే థియేటర్స్ లో బొమ్మల సినిమా చూపించారు అది కూడా క్వాలిటీ పరంగా కూడా చాలానే కామెంట్స్ వచ్చాయి.

కానీ ఇప్పుడు మారిన టెక్నాలజీతో కొచ్చాడియాన్ ని AI రీమాస్టర్ చేసి టీజర్ విడుదల చేస్తే దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక దీనిపై సౌందర్య కూడా ఒక ఎమోషనల్ పోస్ట్ ని చేయడం జరిగింది. ఈ రీ ఇమాజిన్ వెర్షన్ తో తన ఎమోషన్ ని మాటల్లో చెప్పలేను అని నా మొదటి బేబీ, నా మొదటి నమ్మకం అప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఎవరు చేయని ప్రయోగం మేము చేసాము. అది నన్ను ఛాలెంజ్ చేసింది చాలా నేర్పింది. కొన్ని ప్రయాణాలు ఎప్పటికీ ముగుంపు లేనివి అంటూ భావోద్వేగంగా ఆ టీజర్ తో పోస్ట్ చేసింది. దీనితో తలైవర్ ఫ్యాన్స్ లో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు