ఫోర్బ్స్ ఇండియా 100 జాబితాలో మన హీరోలు ఎక్కడున్నారు

ఫోర్బ్స్ ఇండియా 100 జాబితాలో మన హీరోలు ఎక్కడున్నారు

Published on Dec 19, 2019 12:54 PM IST

Prabhas2

ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ప్రతి సంవత్సరంలాగానే ఈ 2019కి కూడా ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాను విడుదల చేసింది. 2018 అక్టోబర్ 1 నుండి 2019 సెప్టెంబర్ 30 వరకు తారల సంపాదనను బట్టి ఈ జాబితాను తయారుచేశారు. ఇందులో మొదటి నాలుగు స్థానాల్లో విరాట్ కొహ్లీ, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ఉండగా మన దక్షిణాది నుండి సూపర్ స్టార్ రజనీకాంత్ రూ.100 కోట్ల సంపాదనతో 13వ స్థానంలో ఉన్నారు.

సౌత్ నుండి జాబితాలో మెరుగైన స్థానం అందుకుంది కూడా రజనీయే. ఇక మిగతా హీరోల విశయానికొస్తే రెబల్ స్టార్ ప్రభాస్ రూ.35 కోట్ల సంపాదనతో 44వ స్థానంలో రూ.30 కోట్లతో మరో తమిళ హీరో విజయ్ 47వ స్థానంలో ఉండగా మహేష్ బాబు రూ.34 కోట్ల సంపాదనతో 54వ స్థానంలో, రూ.34 కోట్లతో కమల్ హాసన్ 56వ స్థానంలో, రూ.33.5 కోట్లతో మమ్ముట్టి 62వ స్థానంలో, ధనుష్ 64వ స్థానంలో ఉన్నారు.

తాజా వార్తలు