
అక్కినేని కుటుంబం నిర్మించి నటించిన ‘మనం’ ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండమైన విడుదలకు సిద్ధం అయ్యింది. నాగార్జున ‘మనం’ తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైందని అందువల్ల ఈ చిత్రానికి సంబందించిన ప్రతీ విషయం పై ఎంతో శ్రద్ధ తీసుకున్నానని తెలిపారు.
ఈ చిత్రం 1920 నుంచి 2013 ప్రాంతం లో జరుగుతుంది అందువల్ల ‘మనం’ టీం మొత్తం ఆ కాలపు వాతవరణాన్నిమళ్లీ సృష్టించారు. దానికి చిన్న ఉదాహరణ ఒక సన్నివేశం లో గోల్డ్ స్పాట్ బాటిల్ పెట్టడం. దర్శకుడు విక్రమ్ కుమార్ ఇటువంటి చిన్న చిన్న విషయాలను కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు.
యె.యెన్.ఆర్ నాగార్జున నాగచైతన్య శ్రియ సమంత నటించిన ఈ సినిమా కి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

