పవన్ కోసం చార్మినార్ సెట్.. చాలా స్పెషల్

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో క్రిష్ చిత్రం కూడ ఉంది. ఈ సినిమా చారిత్రిక నేపథ్యంలో ఉండనుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు నిర్మాత ఏ.ఎం.రత్నం. 17వ శతాబ్దంలోని కథ కావడంతో ఆ కాలాన్ని గుర్తుచేసేలా స్పెషల్ సెట్స్ వేస్తున్నారు. అందులో భాగంగానే చార్మినార్ సెట్ వేస్తున్నారట. ఇది 17వ శతాబ్దం నాటి కాలాన్ని గుర్తుచేసేలా ఉంటుందట.

సినిమాలో ఇదే అత్యంత కాస్ట్లీ సెట్ అని తెలుస్తోంది. ఇందులో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారట టీమ్. ఇప్పటికే క్రిష్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి పిరియాడికల్ డ్రామాను తెరకెక్కించి తన ప్రతిభను నిరూపించుకున్నారు. కాబట్టి ఈ సినిమాను కూడ అదే స్థాయిలో పూర్తి ఖచ్చితత్వంతో తెరకెక్కిస్తారని అనుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమా టైటిల్ పేరుతో రకరకాల పేర్లు వినిపిస్తున్నా ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. సరైన టైమ్ చూసి తామే స్వయంగా రివీల్ చేస్తామని అంటున్నారు టీమ్. పవన్ తొలిసారి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలతో ఉన్నారు అభిమానులు, ప్రేక్షకులు.

Exit mobile version