ఐటెమ్ సాంగ్ ఆయన కోసమే చేశాను – కాజల్

ఐటెమ్ సాంగ్ ఆయన కోసమే చేశాను – కాజల్

Published on May 15, 2024 5:00 PM IST

హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కూడా ఫుల్ బిజీగా ఉంది. సరైన పాత్రలను ఎంచుకుంటూ తన సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా బాగానే కొనసాగిస్తోంది. తాజాగా కాజల్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. ‘జనతా గ్యారేజ్‌’లో ఐటెమ్ సాంగ్ ఎందుకు చేసిందో కూడా కాజల్ చెప్పింది. ఆ సాంగ్ ఎన్టీఆర్‌ కోసం చేశాను. తారక్ తో నేను ఎన్నో సినిమాలు చేశాను. నాకు ఆ పాట ఛాలెంజింగ్‌గా అనిపించింది. అందుకే ఆ పాట చేశాను అంటూ కాజల్ చెప్పింది.

కాజల్ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను ముంబయిలో పుట్టాను. మొదట్లో నాకు తెలుగు వచ్చేది కాదు. ఆ తర్వాత తెలుగు నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడుతున్నాను. నాకు తెలుగు, సెకండ్‌ లాంగ్వేజ్‌లా మారిపోయింది. పైగా తెలుగులోనే మళ్లీ బిజీ అయ్యాను. అందుకే, తెలుగు అంటే నాకు ఇష్టం అంటూ కాజల్ చెప్పింది. తన వివాహం గురించి కూడా కాజల్ మాట్లాడుతూ.. మేం ప్రేమించుకున్నాం. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం అని కాజల్ తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు