
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా గత 10 రోజులుగా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ మోత మోగిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే అన్ని సూపర్బ్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నమోదైంది. శ్రీమంతుడు సినిమాలో కొరటాల శివ తీసుకున్న సబ్జెక్ట్ పరంగా, మహేష్ బాబు పెర్ఫార్మన్స్ విషయాల్లో ఇండస్ట్రీ నుంచి ప్రశంశలు వెల్లువెత్తాయి. అంతే కాకుండా రాజకీయ ప్రముఖులైన వెంకయ్య నాయుడు, కేటిఆర్ లు కూడా మహేష్ బాబు చేసిన అటెంప్ట్ ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.
ఇలా ఎంతమంది ఎన్ని రాకాలుగా మెచ్చుకున్నా మన సొంత కుటుంబ సభ్యుల నుంచి వచ్చే కొన్ని కాంప్లిమెంట్స్ మాత్రం చాలా స్పెషల్ గా నిలిచిపోతాయి. అలాగే శ్రీమంతుడు విషయంలో మహేష్ బాబుకి కృష్ణ గారి నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ కంటతడి పెట్టించాయి. ‘సోషల్ మెసేజ్ తో పాటు కుటుంబ విలువలు ఉన్న సినిమా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని’ నాన్నగారు ఇచ్చిన కాంప్లిమెంట్స్ నా చేత కన్నీళ్లు పెట్టించాయి. ఇకపోతే ‘సినిమా చూసాక వెంకటేష్ గారు ఫోన్ చేసి గంటసేపు మాట్లాడటమే కాకుండా సీన్ సీన్ ని వివరించి చెప్పడం చాలా గొప్పగా అనిపించింది. గౌతమ్ కి యాక్షన్ ఎపిసోడ్స్ పెద్దగా నచ్చవు, కానీ ఈ సినిమాలో ఫైట్స్ బాగున్నాయి అన్నాడు. ఇక సితార అయితే సినిమా చూసినప్పటి నుంచి పాటలు హమ్ చేస్తూ డాన్సులు చేస్తోంది. ఇవన్నీ నాకు చాలా స్పెషల్ కాంప్లిమెంట్స్’ అని మహేష్ బాబు తెలిపాడు.

