“సర్కారు వారి పాట”లో మహేష్ లుక్స్ పై ప్రత్యేక శ్రద్ధ?

Published on Oct 28, 2020 6:54 pm IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మాస్ ఎంటర్టైనింగ్ చిత్రం “సర్కారు వారి పాట” టైటిల్ అనౌన్స్మెంట్ తోనే భారీ హైప్ ను తెచ్చుకున్న ఈ చిత్రం ఆ తర్వాత ప్రీ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ టీజర్ లతో మరింత అంచనాలను పెంచుకోంది.

అయితే గత మూడు చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ లుక్స్ పరంగా “మహర్షి”లో కాస్త కొత్త లుక్ ను ట్రై చేసి ఇంప్రెస్ చేసారు. ఇప్పుడు మళ్ళీ సర్కారు వారి పాట మేకర్స్ ఆ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే మహేష్ ఇందులో రెండు భిన్నమైన షేడ్స్ లో కనిపించడం ఫిక్సయిన సంగతి తెలిసిందే.

అయితే ఇందులో మాస్ రోల్ కు గాను మేకర్స్ మహేష్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చే విధంగా కేర్ తీసుకోనున్నట్టు టాక్. ఈ లుక్ లో ఖచ్చితంగా వింటేజ్ మహీలా మెస్మరైజ్ చెయ్యడం ఖాయమని తెలుస్తుంది. అలాగే ఈ లుక్ కోసమే మహేష్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు అలాగే మహేష్ బాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రం తాలూకా షూటింగ్ మొదలు కానుంది.

సంబంధిత సమాచారం :