పద్మవిభూషణ్ చిరంజీవికి ‘విశ్వంభర’ టీమ్ ప్రత్యేక అభినందనలు

పద్మవిభూషణ్ చిరంజీవికి ‘విశ్వంభర’ టీమ్ ప్రత్యేక అభినందనలు

Published on Jan 26, 2024 8:32 PM IST

నిన్నటి భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో భాగంగా మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి దేశంలోని రెండవ అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. దానితో ఒక్కసారిగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సహా అనేకమంది మెగాఫ్యాన్స్ ఆయనకు శుభాభినందనలు తెలియచేస్తున్నారు.

నటుడిగా 150 కి పైగా సినిమాలతో ఎంతో గొప్ప క్రేజ్ సొంతం చేసుకోవడంతో పాటు మానవతావాదిగా ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంకు వంటివి నెలకొల్పి అలానే పలు ఇతర సామజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న మెగాస్టార్ ఈ అవార్డుకు ఎంతో అర్హులని పలువురు కొనియాడుతున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ టీమ్ పద్మవిభూషణ్ అందుకోవడం పై ఆయనకు ప్రత్యేకంగా ఒక ప్రత్యేక పోస్టర్ ద్వారా శుభాభినందనలు తెలియచేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు