స్పెషల్ : హ్యాపీ బర్త్ డే టూ గ్లోబల్ స్టార్ ‘రామ్ చరణ్’

స్పెషల్ : హ్యాపీ బర్త్ డే టూ గ్లోబల్ స్టార్ ‘రామ్ చరణ్’

Published on Mar 27, 2024 12:44 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అత్యద్భుత పెర్ఫార్మన్స్ కనబరిచి ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని మెప్పించి వరల్డ్ వైడ్ గా గొప్ప క్రేజ్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారీ పొలిటికల్ యాక్షన్ పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటెర్టైనర్ గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు చరణ్.

దీనితో ఇప్పటికే తన నెక్స్ట్ మూవీస్ అయిన RC 16, RC 17 మూవీస్ ని కూడా అనౌన్స్ చేసారు. ఇవి రెండూ కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. విషయం ఏమిటంటే, నేడు రామ్ చరణ్ బర్త్ కావడంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు సహా పలు ఇతర ప్రాంతాల్లోని చరణ్ ఫ్యాన్స్ ఆయన పేరిట పలు సామజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. ఇక నేడు తిరుమల వేంకటేశ్వరుని ప్రత్యేకంగా దర్శించుకోనున్నారు చరణ్, ఉపాసన దంపతులు.

మరోవైపు చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ నుండి రేపు ఫస్ట్ సాంగ్ జరగండి రిలీజ్ కానుండగా, గతంలో చరణ్ నటించిన అతి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ మగధీర థియేటర్స్ లో రీరిలీజ్ కానుంది. మొత్తంగా రేపు చరణ్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ అన్నమాట. ఇక నటుడిగా రామ్ చరణ్ మరిన్ని విజయాలు అందుకుని కెరీర్ పరంగా మరింత మంచి క్రేజ్, పేరుతో కొనసాగాలని కోరుకుంటూ మా 123 తెలుగు టీమ్ తరపున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు