నూత‌న ప్ర‌భుత్వ ప్ర‌మాణ స్వీకారోత్స‌వం.. స్టేట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం

నూత‌న ప్ర‌భుత్వ ప్ర‌మాణ స్వీకారోత్స‌వం.. స్టేట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం

Published on Jun 11, 2024 2:00 PM IST

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన టిడిపి-జ‌నసేన‌-బీజేపీ కూట‌మి, రాష్ట్రంలో నూత‌న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మ‌య్యింది. ఈ క్ర‌మంలో నేడు జ‌రిగిన ఎన్డీయే కూట‌మి సమావేశంలో ఎన్డీయే శాస‌న‌స‌భ ప‌క్ష నేత‌గా టిడిపి చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడుని ఎన్నుకున్నారు.

దీంతో రేపు ఆయ‌న ఏపీ రాష్ట్ర నూత‌న సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేపట్ట‌నున్నారు. ఆయ‌న‌తో పాటు ఇత‌ర మంత్రులు కూడా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. కాగా, ఈ ప్రమాణ స్వీకారోత్స‌వానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రుడు, మెగాస్టార్ చిరంజీవికి స్టేట్ గెస్ట్ గా ప్ర‌త్యేక ఆహ్వానం పంపారు చంద్ర‌బాబు.

ఈ ఆహ్వానం మేర‌కు చిరంజీవి నేడు సాయంత్రం ప్ర‌త్యేక విమానంలో విజ‌యవాడ‌కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంట‌ల‌క బేగంపేట విమానాశ్ర‌యం నుండి బ‌య‌ల్దేరి విజ‌య‌వాడ‌కు చేరుకుంటారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు