చరణ్ సినిమాలో స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ !

28th, March 2018 - 04:29:34 PM

రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఒక షెడ్యూల్ కూడ ముగిసింది. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. తన ప్రతి సినిమాలోనూ ఒక ప్రత్యేక గీతం ఉండేలా చూసుకునే బోయపాటి ఈ సినిమాకి కోసం కూడ అలాంటి పాటే ఒకదాన్ని రూపొందించనున్నారు.

అంతేగాక ఈ పాటలో ఒక స్టార్ హీరోయిన్ ఆడి పాడుతుందట. ప్రస్తుతానికి తమన్నా పేరు వినిపిస్తుండగా ఇంకా తుది ఎంపిక జరగలేదు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు.