చిరు బర్త్‌డే పార్టీలో చెర్రీ, బన్నీ స్పెషల్ పర్ఫామెన్స్!

charan-allu-arjun
మెగాస్టార్ చిరంజీవి 60వ జన్మదిన వేడుకలకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా టాప్ స్టార్స్ అంతా సిద్ధమైపోయారు. ఈ రాత్రి హైద్రాబాద్‌లోని పార్క్ హయత్‌లో పెద్ద ఎత్తున చిరు జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల కోసం మెగా ఫ్యామిలీ ఇప్పటికే భారీ ఎత్తున సన్నాహాలు చేసింది. మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు పలువురు టాప్ టాలీవుడ్ స్టార్స్, రాజకీయ ప్రముఖుకలు కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. పార్టీ కోసం ప్రత్యేకంగా కొన్ని వినోద కార్యక్రమాలను కూడా ప్లాన్ చేశారు.

ఇందులో భాగంగా రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు పర్ఫామ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఓ డ్యాన్స్ పర్ఫామెన్స్ కోసం ఇప్పటికే సన్నాహాలు కూడా పూర్తి చేసేశారట. బర్త్‌డే పార్టీకి ఈ పర్ఫామెన్సెస్ హైలైట్‌గా నిలవనున్నాయని సమాచారం. ఇక చిరంజీవి పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో నిన్నటినుంచే అన్నిచోట్లా హడావుడి మొదలైంది. నిన్న సాయంత్రం శిల్పకళావేదికలో అభిమానుల సమక్షంలో చిరు పుట్టినరోజు వేడుకలు ఒకరోజు ముందే వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక నేటి పార్టీ ప్రైవేట్ కార్యక్రమంగా సినీ ప్రముఖుల సమక్షంలో జరగనుంది.