మెగా హీరో సాయితేజ్ కొత్త చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటరు’. ఈ సినిమా మీద తేజ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన రెండు పాటలు మంచి బజ్ తెచ్చుకోగా ఇప్పుడు మూడవ పాట రిలీజ్ కానుంది. ఈ పాట చాలా స్పెషల్ సాంగ్. ఎందుకంటే ఇదొక బ్రేకప్ సాంగ్. ఈమధ్య కాలంలో మేకర్స్ బ్రేకప్ సాంగ్స్ మీద ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు. అలా ‘సోలో బ్రతుకే సో బెటరు’ బృందం కూడ ఈ పాటకు స్పెషల్ కేర్ తీసుకుందట. ఈ పాట విడుదల గురించి చెబుతూ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘తొలిప్రేమ’లోని పెయిన్ ఫుల్ సాంగ్ అయిన ‘గగనానికి ఉదయం’ ఒకటే పాటతో రేపు రిలీజ్ కాబోయేది మంచి ఫీల్ ఉన్న బ్రేకప్ సాంగ్ అంటూ క్లారిటీ ఇచ్చాడు తేజ్.
అలాగే నాకు అమృత(నభా నటేష్)తో బ్రేకప్ అయింది. మిత్రమా తమన్ హెల్ప్ చెయ్యి అంటూ చమత్కారంగా ట్వీట్ వేశాడు తేజ్. మరి తేజ్ ఇంత ప్రత్యేకంగా చెబుతున్న ఆ సాంగ్ నిజంగానే ‘గగనానికి ఉదయం’ ఒకటే లెవల్లో ఉంటుందేమో చూడాలి. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటెర్టైనర్ విడుదలపై త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. ఇప్పటికే షూటింగ్ ముగియగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం చివరి దశలో ఉన్నాయి.
