సూపర్ స్టార్ మహేష్ బాబు (SSMB) ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ ఏడాది జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. నేడు మదర్స్ డే సందర్భంగా చిత్ర బృందం ఒక స్పెషల్ వీడియోను ను రిలీజ్ చేయడం జరిగింది.
ఈ చిత్రం లో మదర్స్ సెంటిమెంట్ హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తమ కుటుంబం నుండి వెళ్లిపోయిన తల్లిని తీసుకొచ్చే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కింది. అయితే తల్లి కొడుకుల బంధం గురించి చెప్పిన ఈ చిత్రం లోని మంచి సన్నివేశాలను ఒక వీడియో లో ఎడిట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎడిట్ చేసిన వీడియో ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రానికి సంగీత అందించిన థమన్ వీడియో బాగుంది అంటూ కామెంట్ చేశారు.
యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో మీనాక్షి చౌదరి, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
What a edit ????♥️ #HappyMothersDay #GunturKaaram ???? https://t.co/TOB5iFH6L6
— thaman S (@MusicThaman) May 12, 2024