రాజన్న సెట్ అదుర్స్

రాజన్న సెట్ అదుర్స్

Published on Dec 17, 2011 9:10 AM IST

 

‘కింగ్’ అక్కినేని నాగార్జున నటించిన ఒక యోధుడి గాధ ‘రాజన్న’. ఈ చిత్రం డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తం గా భారీ గా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి సెట్స్ మరియు ఆర్ట్ డైరెక్షన్ అద్భుతం గా ఉన్నాయని చిత్రం సీమ నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా నేలకొండపల్లి ఊరు సెట్టు, క్లైమాక్స్ ఫైట్ తాలూక కోట సెట్టు బ్రహ్మాండం గా వచ్చాయి. సహజత్వం ఉట్టిపడేలా వీటిని తీర్చిదిద్దటానికి చాల కష్టపడ్డారు. నేలకొండపల్లి సెట్టు ను చూస్తే, అచ్చం 1950 లో ఉండే తెలంగాణా పల్లె ఉన్నట్లు గానే ఉంది అని విశ్లేషకులు చెబుతున్నారు.

రవీందర్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసారు. ఈయనకు రాజమౌళి తో మంచి అనుబంధం ఉంది. గతంలో రాజమౌళి తీసిన మగధీర, మర్యాద రామన్న చిత్రాలకు ఈయనే ఆర్ట్ డైరెక్టర్. మర్యాద రామన్న చిత్రం లో ఈయన నిర్మించిన ఇంటి సెట్టు కు ఈయనకు పేటెంట్ కూడా లభించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు