‘స్పీడున్నోడు’గా మారనున్న ‘అల్లుడు శీను’

Bellamkonda-Srinivas
కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘అల్లుడు శీను’తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమాలో తన డాన్సులు, ఫైట్స్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ తన రెండవ సినిమాని భీమనేని శ్రీనివాస్ డైరెక్షన్ చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో సోనారిక బడోరియా హీరోయిన్ గా కనిపించనుంది.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘సుందర పాండ్యన్’ సినిమాకి ఇది అధికారిక రీమేక్. షూటింగ్ పూర్తవడంతో ఈ చిత్ర టీం ఈ సినిమాకి సరిపోయే పర్ఫెక్ట్ టైటిల్ ని పెట్టే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ‘స్పీడున్నోడు’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారని సమాచారం. త్వరలోనే దీనిపైన కచ్చితమైన నిర్ణయం తీసుకోనున్నారు. అల్లుడు శీను లోలానేఈ సినిమాలో కూడా తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీ మరియు ఫ్రెండ్షిప్ ని బేస్ చేసుకొని చేసిన ఈ సినిమాతో కూడా హిట్ అందుకుంటానని బెల్లంకొండ శ్రీనివాస్ నమ్మకంగా ఉన్నాడు.

Exit mobile version