హాలీవుడ్ సినిమా దగ్గర ఈ ఏడాది రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ సినిమాల్లో టామ్ హోలాండ్ హీరోగా జెండాయ హీరోయిన్ గా నటించిన క్రేజీ సూపర్ హీరో సినిమా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కూడా ఒకటి. ఎంతో ఆసక్తిగా అభిమానులు ఎదురు చూసిన ఈ సినిమా ఇండియన్ మార్కెట్ లో కూడా భారీ లెవెల్లో విడుదల అయ్యింది. మన దగ్గర పాన్ ఇండియా భాషల్లో విడుదల అయ్యిన ఈ సినిమా ఏ హోలీవుడ్ సినిమా కూడా అందుకోని రికార్డ్ ఓపెనింగ్స్ సాధించింది.
ఇలా మొత్తం 3 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా 200 కోట్ల మార్క్ ని దాటేసి హాలీవుడ్ నుంచి ఫాస్టెస్ట్ 200 కోట్ల గ్రాస్ సినిమాగా నిలిచింది. మొత్తం 3 రోజుల్లో 216 కోట్ల గ్రాస్ ని రాబట్టి దుమ్ము లేపింది. ఇక ఈ ఆదివారం వసూళ్లతో సినిమా ఈజీగా 250 కోట్ల క్లబ్ లో చేరిపోతుంది. ఇక ఫైనల్ రన్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ గ్రాసర్ గా ఈ సినిమా నిలుస్తుందో లేదో చూడాల్సిందే.


