‘స్పైడర్ మ్యాన్’ థియేటర్స్ లో మూవీ లవర్స్ కి పండుగ.. బిగ్ స్క్రీన్స్ పై రామాయణ, అవెంజర్స్ ట్రీట్!

‘స్పైడర్ మ్యాన్’ థియేటర్స్ లో మూవీ లవర్స్ కి పండుగ.. బిగ్ స్క్రీన్స్ పై రామాయణ, అవెంజర్స్ ట్రీట్!

Published on Jul 28, 2026 4:18 PM IST

చాలా కాలం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా లవర్స్ కి బిగ్గెస్ట్ ట్రీట్ ఇప్పుడు థియేటర్స్ లో రాబోతుంది. మార్వెల్ సంస్థ నుంచి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే గ్రాండ్ గా విడుదల అవుతున్న నేపథ్యంలో అభిమానులు ప్రపంచ నలుమూలలా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో మన దేశంలో కూడా పాన్ ఇండియా ఆడియెన్స్ మరింత ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

అయితే ఈ చిత్రం బిగ్ స్క్రీన్స్ పై చూసేవారికి థియేటర్స్ లో మరో క్రేజీ ట్రీట్ కూడా ఉన్నట్టు వినిపిస్తుంది. ఈ సినిమాతో పాటుగా ప్రపంచ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో రెండు సినిమాలు రామాయణ అలాగే అవెంజర్స్ డూమ్స్ డే ల తాలూకా థియేట్రికల్ ట్రైలర్స్ ని అటాచ్ చేసి విడుదల చేస్తున్నారట. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ న్యూస్ అని చెప్పి తీరాల్సిందే. ముఖ్యంగా సినిమా లవర్స్ కి ఇది వెండితెరపై సాలిడ్ మంచి వార్త అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు