పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ది మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ (Spirit)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి న్యూ ఇయర్ కానుకగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్‌తోనే ‘స్పిరిట్’ (Spirit)సినిమా ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపెట్టారు వంగా. రూత్‌లెస్ కాప్‌గా ఈ సినిమాలో ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్‌లో వారిద్దరికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉండబోతుందా అని ఈ ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది. ప్రభాస్ ఈ లుక్స్ పరంగా ఎలా ఉండబోతున్నాడో.. ఈ సినిమాలో అతని పాత్ర ఎంత కఠినంగా ఉంటుందో ఈ లుక్ లో రివీల్ చేశారు. ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్, కాంచన వంటి స్టార్స్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
