గాయపడ్డ సింహం : బాగా కలిసొచ్చిన శ్రీవిష్ణు సీక్వెన్స్..!

గాయపడ్డ సింహం : బాగా కలిసొచ్చిన శ్రీవిష్ణు సీక్వెన్స్..!

Published on May 2, 2026 6:02 PM IST

Sree Vishnu

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈవారం రిలీజ్ అయిన చిత్రాల్లో ‘గాయపడ్డ సింహం’ కూడా ఒకటి. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ సినిమాను కశ్యప్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశాడు. సెటైరిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ రెస్పాన్స్ లభించింది. అయితే, ఈ సినిమాలో యంగ్ హీరో శ్రీవిష్ణు చేసిన క్యామియో రోల్ మాత్రం సినిమాకు హైలైట్‌గా నిలిచింది.

తనదైన కామెడీ టైమింగ్‌తో శ్రీవిష్ణు నవ్విస్తాడు. ఇక ఈ సినిమాలో ఆయన చేసే చేతబడి సీక్వెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సీక్వెన్స్‌లో శ్రీవిష్ణు చేసిన కామెడీ సూపర్బ్‌గా వర్కవుట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఈ సీక్వెన్స్ ప్రాణంగా నిలిచిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక శ్రీవిష్ణు ఈ సినిమాలో చేసిన క్యామియో రోల్ ఈ చిత్రానికి బూస్ట్ అయ్యిందని చెప్పాలి. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు