కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు రీసెంట్‌గా ‘విష్ణు విన్యాసం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత కేవలం వారం రోజుల గ్యాప్‌లో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ హీరో. ‘మృత్యుంజయ్’ (Mrithyunjay) అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం మార్చి 6న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో సాగింది. ఓ హంతకుడి కోసం శ్రీవిష్ణు చేసే వెతుకులాట ఎలా ఉండబోతుందనేది మనకు ఈ సినిమా కథగా చూపెట్టబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కిల్లర్‌ను కనిపెట్టేందుకు శ్రీవిష్ణు కొనసాగించిన పోరాటం ఈ సినిమాలో హైలైట్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక క్రైమ్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు చక్కటి ఎమోషనల్ అంశం కూడా ఈ మూవీలో ఉండనుంది.
శ్రీవిష్ణు పలు గెటప్స్‌లో కనిపించే ఈ సినిమాలో రెబా మోనిక జాన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తోంది. హుస్సేన్ షా కిరణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
