శ్రీ‌విష్ణు హీరోగా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.!

Published on Dec 10, 2020 5:06 pm IST

టాలీవుడ్ సినీ ప్రేమికులకు “క్ష‌ణం”, “ఘాజి”, “గ‌గ‌నం” లాంటి ఆసక్తికర కంటెంట్ ఉన్న క‌మ‌ర్షియ‌ల్ హిట్ సినిమాల్ని నిర్మించిన ప్ర‌తిష్ఠాత్మ‌క నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా ‘ఆచార్య‌’, కింగ్ నాగార్జున్ హీరోగా ‘వైల్డ్ డాగ్’ లాంటి క్రేజీ ఫిలిమ్స్‌ను నిర్మిస్తోంది.

ఇటు ప్రేక్ష‌కాద‌ర‌ణ‌, అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లుపొందిన ‘ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ’ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మైన స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె. ద‌ర్శ‌క‌త్వంలో ఓ మీడియం బ‌డ్జెట్ మూవీని ప్రొడక్షన్నంబర్ 8గా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఇదిలా ఉండగా ఈ గురువారం (డిసెంబ‌ర్ 10) శ్రీ‌విష్ణు హీరోగా, జోహార్ ఫేమ్ తేజ మార్ని ద‌ర్శ‌క‌త్వంలో ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 9 మూవీని మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనౌన్స్ చేసింది. విల‌క్ష‌ణ‌ల స‌బ్జెక్టుల‌ను ఎంచుకుంటూ వ‌స్తున్న శ్రీ‌విష్ణు, తొలి సినిమా జోహార్‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న తేజ మార్ని, కంటెంట్ రిచ్ ఫిలిమ్స్‌కు పేరుపొందిన మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ తొలి క‌ల‌యిక‌లో రూపొందనున్న ఈ సినిమా 2021లో వ‌చ్చే ఆస‌క్తిక‌ర సినిమాల్లో త‌ప్ప‌కుండా ఉంటుంద‌నేది నిస్సందేహం.

కేప‌ర్ కామెడీగా రూపొందే ఈ టైటిల్ నిర్ణ‌యించ‌ని సినిమా గురువారం హైద‌రాబాద్‌లోని సంస్థ కార్యాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది. అన్వేష్ రెడ్డి, శ్రీ‌విష్ణు, అమృతా అయ్య‌ర్ క‌లిసి సినిమా స్క్రిప్టును ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు అంద‌జేశారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ క్లాప్ నివ్వ‌గా, సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దీనికి స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె. గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

త‌న తొలి తెలుగు సినిమా విడుద‌ల కాక‌మునుపే అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోన్న అమృతా అయ్య‌ర్ ఈ చిత్రంలో శ్రీ‌విష్ణు జోడీగా న‌టిస్తున్నారు.నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్‌.ఎమ్‌. పాషా స‌హ నిర్మాత‌. ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌టంతో పాటు క‌థ‌, స్క్రీన్‌ప్లేల‌ను తేజ మార్ని అందిస్తుండ‌గా, సుధీర్ వ‌ర్మ పి. డైలాగ్స్ రాస్తున్నారు.

ఈ నెల‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌య్యే ఈ చిత్రానికి ప్రియ‌ద‌ర్శ‌న్ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, జ‌గ‌దీష్ చీక‌టి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు. మరి ఈ టాలెంటెడ్ హీరోకు ఇది మరో మెట్టు పైకెక్కించే అంశమే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :