‘వీరభోగ వసంతరాయలు’ లాంటి డిజాస్టర్ తర్వాత ‘బ్రోచేవారెవరురా’ చిత్రంతో విజయాన్ని అందుకుని ఊపిరి పీల్చుకున్నాడు శ్రీవిష్ణు. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతోనే ఈ శుక్రవారం 8వ తేదీ ‘తిప్పరా మీసం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీవిష్ణు గత సినిమాల మాదిరిగానే ఈ చిత్రం కూడా భిన్నమైన కథాంశంతో రూపొందిందని చిత్ర సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.
ఇన్నాళ్లు ఒక స్టాండర్డ్ మార్కెట్ అంటూ లేని శ్రీవిష్ణుకు ఈ చిత్రం హిట్ అయితే మార్కెట్ క్రియేట్ అయ్యే అవకాశాలున్నాయి. మరి ‘అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని తనవైపుకు తిప్పుకున్న శ్రీవిష్ణు ఈ చిత్రంతో అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారో లేదో చూడాలి. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రిజ్వాన్ నిర్మించిన ఈ చిత్రాన్ని కృష్ణ విజయ్ ఎల్ డైరెక్ట్ చేశారు.


