ఈ హీరో జూ.ఎన్టీఆర్ వీరాభిమాని

Sree Vishnu

హీరో శ్రీవిష్ణు చక చకా సినిమాలు చేసుకుపోతున్నారు. ఆయన చేసిన కొత్త చిత్రం గాలి సంపత్ రేపు గురువారం రిలీజ్ కానుంది. ఈ సినిమా మీద మంచి పాజిటివ్ బజ్ ఉంది. చిత్రం తప్పంకుండా విజయం సాధిస్తుందనే ధీమాతో ఉన్నారు శ్రీవిష్ణు. ఈ సినిమాతో పాటే ఇంకొన్ని సినిమాలు స్టార్ట్ చేశారు శ్రీవిష్ణు. వాటిలో అర్జున ఫల్గుణ ఒకటి. ఈ సినిమాను తేజ మర్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు సగటు మధ్యతరగతి కుర్రాడి పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రలో ఇంకొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఇందులో ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని.

తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ తన ఫోటోలతో బ్యానర్లు కడుతూ సినిమాల విడుదలప్పుడు హంగామా చేస్తూ ఉండే అభిమానిలా కనిపిస్తాడు. మరి కేవలం ఆయన పాత్రలోనే ఎన్టీఆర్ ఎఫెక్ట్ ఉంటుందా లేకపోతే కథలో ఏమైనా ఉంటుందా అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా, సీనియర్‌ నరేశ్‌, శివాజీరాజా, సుబ్బరాజు, దేవిప్రసాద్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version