టాలీవుడ్లో ఊపు ఊపిన శ్రీలీల కెరీర్ ప్రస్తుతం సరికొత్త మలుపు తిరిగింది. ‘రాబిన్‌హుడ్’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలు ప్లాప్ అవ్వడం, పారితోషికం పెంచారనే వార్తల నడుమ ప్రస్తుతం ఆమె చేతిలో కొత్త తెలుగు సినిమాలేవీ లేవు. దీంతో టాలీవుడ్ మేకర్స్ ఆమెను పక్కన పెట్టారా లేక తనే గ్యాప్ తీసుకుందా అనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది.
అయితే శ్రీలీల ప్రస్తుతం తన దృష్టిని కోలీవుడ్, బాలీవుడ్పైకి మళ్లించింది. తమిళంలో ధనుష్ సినిమాతో పాటు, బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్‌తో అనురాగ్ బసు మూవీ, ఇబ్రహీం అలీ ఖాన్‌తో ‘దిలేర్’ చిత్రాల్లో నటిస్తూ ఇతర భాషల్లో పాగా వేసేందుకు సిద్ధమవుతోంది.


