ఇది పక్కా : చరణ్ సినిమాలో చిరు కనిపిస్తాడన్న శ్రీను వైట్ల

ఇది పక్కా : చరణ్ సినిమాలో చిరు కనిపిస్తాడన్న శ్రీను వైట్ల

Published on Aug 20, 2015 7:44 PM IST

Sreenu-Vaitla
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 9వ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. యాక్షన్ ని పెర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ ని మిక్స్ చేసి చెప్పగల శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. రామ్ చరణ్ – శ్రీను వైట్ల సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఈ సినిమాలో చిరు స్టార్ హీరోగానే కనిపిస్తాడని. కానీ ఇందులో ఎలాంటి స్పెషల్ సాంగ్ చేయడం లేదని ఇది వరకే తెలియజేశాం. కానీ ఈ విషయంపైన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటిదాకా వెలువడలేదు.

తాజాగా కొద్ది సేపటి క్రితమే ఈ చిత్ర డైరెక్టర్ శ్రీను వైట్ల అధికారికంగా ఈ విషయాన్ని ఖరారు చేసాడు. ‘మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ నటిస్తున్న 9వ సినిమాలో నటిస్తున్నారని, తను కూడా ఒక పార్ట్ అని అనౌన్స్ చెయ్యడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని’ శ్రీను వైట్ల సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఈ సినిమా లో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్ గా, స్టార్ హీరోలకి డూప్ గా కనిపించే పాత్రలో కనిపించనున్నాడని ఇది వరకే తెలియజేశాం. చిరు 150వ సినిమా ఆలస్యం అయినా చిరంజీవి చరణ్ సినిమాలో కనిపించనుండడం మెగా అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.

రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ మరియు ఫస్ట్ టీజర్ ని చిరు బర్త్ డే కానుకగా ఆగష్టు 22న రిలీజ్ చేయనున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు