మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన సాలిడ్ హారర్ ఎంటర్టైనర్ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ కోసం ఇప్పుడు ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మంచి ఎంటర్టైనింగ్ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ అంతా ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా చేసి ఒకొకటిగా విడుదల చేస్తూ వస్తున్నారు.
అయితే లేటెస్ట్ గా ఈ ప్రమోషన్స్ లో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు కూడా యాడ్ అయ్యి ఫన్ ని డబుల్ చేసాడు. తనపై లేటెస్ట్ గా వదిలిన ఫన్నీ ప్రోమో తన మార్క్ ఫన్నీ డైలాగ్ డెలివరీతో ఇంప్రెస్ చేస్తుంది. ఇలా మొత్తానికి గట్టిగానే ప్రమోట్ చేస్తున్న సినిమా ఈ ఆగష్టు 7న థియేటర్స్ లో సందడి ఎలా చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా కమెడియన్ సత్య తదితరులు నటిస్తున్నారు. అలాగే యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
Dracarys!!🔥🤣
Thanks a lot @sreevishnuoffl bro 🫰🏼
For adding more fun to the #KoreanKanakaraju madness! #KOKAonAug7th pic.twitter.com/sjqF6zHA8M— Varun Tej Konidela (@IAmVarunTej) August 4, 2026
