లేటెస్ట్ : మరో ఫన్ ఎంటర్టైనర్ తో శ్రీవిష్ణు.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

లేటెస్ట్ : మరో ఫన్ ఎంటర్టైనర్ తో శ్రీవిష్ణు.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Published on Feb 22, 2024 12:39 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా దగ్గర వస్తున్నా కొన్ని కామెడీ ఎంటెర్టైనెర్స్ అయితే బాగానే మెప్పిస్తున్నాయి. అలా కొన్ని ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో యంగ్ హీరో శ్రీవిష్ణు చేస్తున్న ఎంటర్టైనెర్స్ అయితే మంచి రెస్పాన్స్ ని అందుకుంటున్నాయి. బ్రోచేవారెవరురా, రాజ రాజ చోర లేటెస్ట్ గా సామజవరగమనా లాంటి చిత్రాల్లో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని అందించిన తాను ఇపుడు తన బ్రోచేవారెవరురా కాంబినేషన్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లతో ఓ ఫన్నీ ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు. మరి ఆ చిత్రమే “ఓం భీం బుష్”.

ఈ టైటిల్ వింటేనే మంచి ఫన్నీగా ఉంది. చిన్న పిల్లలు ఆటలు ఆడుకునే సమయంలో ఈ పదం కూడా చాలా మందే వినుంటారు. మరి ఇలాంటి క్రేజీ క్రేజీ టైటిల్ తో హుషారు ఫేమ్ దర్శకుడు హర్ష కొనుగంటి తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఓ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ కూడా మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేయగా ఈ పోస్టర్ తో పాటుగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేశారు.

మరి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఈ మార్చ్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ వస్తున్నా ఈ చిత్రం ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి సన్నీ ఎం ఆర్ సంగీతం అందిస్తుండగా వి సెల్యులాయిడ్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు