ఆ విషయంలో శ్రీలీల జాగ్రత్త వహించాలంటున్న ఫ్యాన్స్

ఆ విషయంలో శ్రీలీల జాగ్రత్త వహించాలంటున్న ఫ్యాన్స్

Published on Dec 8, 2023 11:00 PM IST


టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం యంగ్ హీరోయిన్ శ్రీలీల వరుసగా ప్రాజక్ట్స్ ని అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. తొలిసారిగా శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లిసందడి మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు శ్రీలీల.

ఆ తరువాత రవితేజ తో ఆమె చేసిన ధమాకా కూడా పెద్ద సక్సెస్ సొంతం చేసుకుంది. అక్కడి నుండి వరుసగా ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో గుంటూరు కారం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సహా మరికొన్ని సినిమాలు చేస్తున్నారు. అయితే ఇటీవల ఆమె నటించిన స్కంద, ఆదికేశవ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. అలానే ఆమె హీరోయిన్ గా నితిన్ హీరోగా తెరకెక్కిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ నేడు ఆడియన్స్ ముందుకి వచ్చింది.

అది కూడా మిక్స్డ్ రివ్యూస్ అందుకుంటూ ఉండడంతో ఇక పై కెరీర్ పరంగా శ్రీలీల తన పాత్రలను ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్త వహించాలని ఆమె అభిమానులు అభిప్రాయపడుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇటీవల బాలకృష్ణ కూతురిగా ఆమె నటించిన భగవంత్ కేసరి మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు