భారీ రీమేక్ లో శ్రీ దివ్యకి ఛాన్స్.?

Sri-Divya
వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న బిగ్ ప్రొడక్షన్ హౌస్ పివిపి బ్యానర్ వారు గత సంవత్సరం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘బెంగుళూరు డేస్’ సినిమా రీమేక్ రైట్స్ కొనుక్కున్నారు. ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్న నాటి నుంచి ఈ సినిమాలో నటించే పలువురు స్టార్ హీరోస్ మరియు హీరోయిన్స్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఒక్క కాంబినేషన్ కూడా కూడా ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. తాజాగా శర్వానంద్ పేరుని కూడా ఈ సినిమాలో ఒక హీరో పాత్రకి పరిశీలించారు.

తాజా సమాచారం ప్రకారం బస్ స్టాప్ సినిమాతో తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న శ్రీ దివ్యని ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. కానీ కచ్చితమైన సమాచారం అయితే అధికారికంగా వెలువడలేదు. ‘మనసారా’, ‘బస్ స్టాప్’, ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ లాంటి సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించిన శ్రీ దివ్య ప్రస్తుతం తమిళంలో వరుస హిట్స్ అందుకుంటూ బిజీబిజీగా ఉంది. బెంగుళూరు డేస్ సినిమా చిన్న నాటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఓ ముగ్గురు యంగ్ స్టర్స్ చుట్టూ తిరిగే కథ. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ప్రొడక్షన్ లో దిల్ రాజు కూడా ఓ భాగస్వామి.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్.

Exit mobile version