
స్వతహాగా తమిళ హీరో అయినా తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరో కార్తీ. కార్తీ చేసే ప్రతి సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం కార్తీ ‘కోంబన్’ అనే సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా పూర్తవగానే మరో రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి కార్తీ ప్లాన్ చేస్తున్నాడు. అందులో ఒకటి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న మల్టీ స్టారర్ మూవీ. నాగార్జున మరో హీరోగా, శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించనున్న ఈ మూవీకి వంశీ పైడిపల్లి డైరెక్టర్.
ఇది కాకుండా కార్తీ గోకుల్ డైరెక్షన్ లో మరో సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు. ‘కాష్మోర’ అనే టైటిల్ ని ఖరారు చేసిన ఈ చిఎన్మాలొ ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. అందులో ఇప్పటికే నయనతార ఒక హీరోయిన్ గా సెలెక్ట్ కాగా మరో హీరోయిన్ గా తెలుగమ్మాయి శ్రీ దివ్యని సెలెక్ట్ చేసారు. తమిళంలో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న శ్రీ దివ్యకి ఈ ఆఫర్ హీరోయిన్ గా తన రేంజ్ ని పెంచిందని చెప్పాలి. ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్.