
ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీదేవి చేసిన కంబ్యాక్ మూవీ ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ విడుదలై దాదాపు సంవత్సరం కావస్తోంది. ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. అప్పట్లోనే ఈ సినిమా పలు భాషల్లో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది.
త్వరలోనే ఈ సినిమా జపనీస్ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కానుంది. తాజా సమాచారం ప్రకారం శ్రీదేవి టోక్యోలో జరగనున్న జపనీస్ వెర్షన్ ప్రీమియర్ షోకి హాజరు కానుంది. ఈ ప్రీమియర్ కి ఈ చిత్ర డైరెక్టర్ గోరి షిండే కూడా హాజరవుతోంది. ఈ సినిమా కథాంశం అమెరికా వెళ్ళిన ఒక ఇండియన్ హౌస్ వైఫ్ చుట్టూ తిరుగుతుంది.