సంక్రాంతికే శ్రీకాంత్ అడ్డాల సినిమా !

Published on May 30, 2019 10:00 pm IST

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ‘బ్రహ్మోత్సవం’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఆయన ఈసారి పక్కాగా స్క్రిప్ట్ రాసుకుని బరిలోకి దిగుతున్నారు. ఇంతకుముందే ఆరంభం కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదాపడుతూ వచ్చింది. దీంతో ముందుగా అనుకున్నట్టు దసరాకు విడుదలచేయడం కుదరదని, వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ పెట్టుకున్నారట దర్శకనిర్మాతలు.

అంటే రాబోయే సంక్రాంతి రేసులో ఇంకో పెద్ద సినిమా చేరినట్టే అనుకోవాలి. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోగా నాని పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఒక క్లారిటీ రాగానే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను బయటపెట్టనున్నారు టీమ్.

సంబంధిత సమాచారం :

More