గోవిండుడికి డబ్బింగ్ పూర్తి చేసిన శ్రీ కాంత్

Published on Sep 11, 2014 11:05 am IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్లో మొదటి సారిగా చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతోంది. సెప్టెంబర్ 12 వరకూ జరగనున్న రామ్ చరణ్ పై ఓ పాటని మరియు కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. దీనికి ముందు జోర్డాన్ లో ఓ పాటని షూట్ చేసారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్ర టీం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇటీవలే డబ్బింగ్ మొదలు పెట్టిన శ్రీ కాంత్ తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ ని పూర్తి చేసాడు. అలాగే నిన్నటి నుంచి ప్రకాష్ రాజ్ కూడా తన పార్ట్ కి డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాడు. లండన్ షెడ్యూల్ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి మిగిలి ఉన్న ఓ పాటని మరియు ఫైనల్ టాకీ పార్ట్ ఎపిసోడ్స్ ని హైదరాబాద్ లో షూట్ చేస్తారు.

రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కుటుంబకథా చిత్రాలు తీయడంలో మంచి పేరు ఉన్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చరణ్ కెరీర్లో మరచిపోలేని సినిమాగా బండ్ల గణేష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :