సక్సెస్ఫుల్ 50 డేస్ @ సూపర్ స్టార్ ‘శ్రీమంతుడు’

సక్సెస్ఫుల్ 50 డేస్ @ సూపర్ స్టార్ ‘శ్రీమంతుడు’

Published on Sep 25, 2015 9:05 AM IST

Srimanthudu-50-Days

టాలీవుడ్ సూపర్ స్టార్ తన పుట్టిన రోజు కానుకగా అభిమానులకు ఇచ్చిన గిఫ్ట్ ‘శ్రీమంతుడు’. ఆగష్టు 7న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. అంతే కాకుండా మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచిపోయింది. అంతే కాకుండా ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ నేటితో 50 రోజులను పూర్తి చేసుకోనుంది. ఈ మధ్య కాలంలో ఇన్ని రోజులు ఆడే సినిమాలు తక్కువ అయినా శ్రీమంతుడు సినిమా మాత్రం 185 థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది.

ఈ విషయంలో మహేష్ బాబుతో పాటు ఈ చిత్ర టీం చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. కొరటాల శివ మహేష్ బాబు అనగానే రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ కాకుండా ఒక సోషల్ మెసేజ్ కి అన్ని కమర్షియల్ హంగులని కలిపి చెప్పడం సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. మన సొంత ఊరుని దత్తత తీసుకోవాలి అనే కాన్సెప్ట్ అందరినీ మెప్పించింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, రాహుల్ రవీంద్రన్ లు ముఖ్య పాత్రలు పోషించారు. మితి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు