
తన అభిమాన హీరో ఎప్పుడెప్పుడు మాకు బాక్స్ ఆఫీసు దగ్గర రికార్డ్స్ బద్దలుగొట్టే సినిమా అందిస్తాడా అని ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ అభిమానులు పండుగ చేసుకునేలా వచ్చిన సినిమా ‘శ్రీమంతుడు’. నేను మహేష్ బాబు బర్త్ డే గిఫ్ట్ గా రెండు రోజుల ముందే రిలీజ్ అయిన ‘శ్రీమంతుడు’ సినిమా అభిమానుల నుంచి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళంలో కూడా మంచి ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలను రీచ్ అవ్వడంతో ప్రతి ఏరియాలోనూ రికార్డ్ కలెక్షన్స్ నమోదవుతున్నాయి.
మహేష్ బాబుకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న నైజాంలో మొదటి రోజు 5.60కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసి రికార్డ్ సృష్టించింది. రెండవ రోజు కూడా అదే జారుని కొనసాగిస్తూ 2.20కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. మొదటి రెండు రోజుల్లో ఈ సినిమా 8 కోట్ల మార్క్ కి దగ్గరైంది. ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్న సమాచారం ప్రకారం ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా 11 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందని అంటున్నారు. మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్టర్. నైజాంలో మొదటి రెండు రోజుల్లో కలెక్ట్ చేసిన షేర్ వివరాలు మీ కోసం..
| వారం |
కలెక్షన్(షేర్) |
| శుక్రవారం | 5.60కోట్లు |
| శనివారం | 2.20 కోట్లు |
| మొత్తం | 7.80 కోట్లు |

