ఫ్యామిలీ ఎమోషన్స్ కి పెద్ద పీట వేసిన ‘శ్రీమంతుడు’

Mahesh-srimantudu
‘మురారి’, ‘అర్జున్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీమంతుడు’. మొదటి సినిమా ‘మిర్చి’సినిమాతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్న ఈ సినిమా ఆడియో జూలై 18న శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరగనుంది. దానికి సంబందించిన కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి.

తాజాగా శ్రీమంతుడు టీం నుంచి మాకు తెలిసిన సమాచారం ప్రకారం కొరటాల శివ మహేష్ బాబు అభిమానులు కోరుకునే యాక్షన్ మరియు కామెడీని సరికొత్తగా ప్రెజంట్ చేస్తూనే ఫ్యామిలీ ఎమోషన్స్ కి పెద్ద పీట వేసారని తెలుస్తోంది. సినిమా ఓవరాల్ లైన్ మొత్తం ఎక్కువ భాగం కుటుంబ విలువలు, సంబంధ బాంధవ్యాల మీద తిరుగుతుందని, అందుకే ఆడియన్స్ ని కట్టిపడేసే ఎమోషనల్ సీన్స్ ఉంటాయని అంటున్నారు. అలాగే యాక్షన్ లవర్స్ ఏ మాత్రం నిరుత్సాహపడకుండా యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం. శ్రీమంతుడు సినిమా సినిమాకి రావడం తగ్గించిన ఫ్యామిలీ ఆడియన్స్ ని మళ్ళీ థియేటర్స్ కి రప్పిస్తుందని ఈ చిత్రం టీం బలంగా నమ్ముతున్నారు.

మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, అంగన రాయ్, సనమ్ శెట్టిలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version