డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్. ‘బాహుబలి’ విడుదలైన తర్వాత అంతటా మారుమోగిన పేరిది. నిజానికి 2012లోనే ఇండియన్ సినిమాకు ఈ సౌండ్ సిస్టమ్ పరిచయమైనా, ఆ సిస్టమ్‌కు అప్‌గ్రేడ్ అయిన థియేటర్లు ఇప్పటికీ చాలా తక్కువే! ‘బాహుబలి’ లాంటి సినిమా ఈ సిస్టమ్‌లో రావడంతో చాలామంది ఈ సిస్టమ్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబర్చడమే కాక చాలా మల్టీప్లెక్స్‌లతో పాటు, సింగిల్ స్క్రీన్లు కూడా అప్‌గ్రేడ్ అయ్యాయి. ఈ సినిమా అందించిన కొత్త ప్రోత్సాహంతో ఇప్పుడు చాలా సినిమాలు ఇదే బాటలో ప్రయాణిస్తున్నాయి.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమా కూడా డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్‌తో అలరించనుందని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియో ఇప్పటికే సూపర్ హిట్‌గా నిలవగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో ఆకర్షణగా నిలవనుందట. ఇక ఇదే స్కోర్ డాల్బీ అట్మాస్‌తో కలిపి చూసినపుడు ఓ సరికొత్త అనుభూతి ఇవ్వనుందని సమాచారం. మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 7న విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే!


