ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షిస్తున్న ‘శ్రీమంతుడు’

ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షిస్తున్న ‘శ్రీమంతుడు’

Published on Aug 11, 2015 8:09 PM IST

srimanthudu-poster
ఈ మధ్య కాలంలో డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్, థియేటర్ యాజమాన్యం ఎక్కువ చెబుతున్న మాట ఒకటే.. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడం తక్కువ అయిపోయింది. తెలుగులో ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే సినిమాలు తక్కువ అయిపోయాయని చెబుతున్నారు. కానీ ఆ మాటలని బ్రేక్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ ‘శ్రీమంతుడు’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఫ్యామిలీ ఎమోషన్స్, మన సొంత ఊరుని గుర్తు చేసే ఎమోషన్స్ తో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రాబట్టుకుంటోంది. వీక్ డేస్ లో కూడా ఏ మాత్రం తక్కకుండా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవ్వడానికి అదే కారణం అని థియేటర్ యాజమాన్యం చెబుతోంది. చూసిన ప్రతి ఒక్క ఫ్యామిలీ తమకు తమ ఊరిని, తమ బంధువులను గుర్తు చేసిందని అంటున్నారు. అలాగే మహేష్ బాబు తన అద్భుతమైన నటనతో కొన్ని చోట్ల కన్నీళ్లు తెప్పించారని కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ తెలిపారు.

మహేష్ బాబు శృతి హాసన్ లు జంటగా నటించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. తెలుగు ప్రేక్షకులు కోరుకునే కామెడీ, యాక్షన్ అంశాలతో పాటు కుటుంబ విలువలు కూడా ఉండడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కనక వర్షం కురిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు