శ్రీముఖికి ఝలక్ ఇచ్చిన బిగ్ బాస్…!

Published on Sep 17, 2019 2:02 am IST

ఈవారం బిగ్ బాస్ కి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ కాబడి వెళ్లిపోయారు. ఇక సోమవారం రావడంలో యధావిధిగా నామినేషన్ పక్రియ ప్రారంభమైంది. బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ కొరకు ఒకొక్కవారం ఒకొక్క ప్రక్రియ అవలంభిస్తారు. ఈ వారం కూడా సరికొత్తగా నామినేషన్స్ జరిగినట్లు మనకి ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది. హౌస్ లోని గార్డెన్ ఏరియాలో ఒక టెలిఫోన్ ఏర్పాటు చేసిన బిగ్ బాస్ దానికి రింగ్ ఇస్తారు. టెలిఫోన్ రింగ్ కావటంతో శ్రీముఖి వచ్చి దానిని లిఫ్ట్ చేస్తుంది. దీనితో బిగ్ బాస్ మాట్లాడుతూ ఫోన్ లిఫ్ట్ చేసిన కారణంగా శ్రీముఖి మీరు నేరుగా నామినేట్ అయ్యారని చెప్పాడు. దీనితో శ్రీముఖి ఒక్కసారిగా షాక్ గురై కామ్ గా వెళ్ళిపోయింది.

అయితే శ్రీముఖి ఒక్కదాని విషయంలోనే ఇలాంటిది జరిగిందా, లేక మిగిలిన హౌస్ మేట్స్ ని కూడా ఇలాగే బిగ్ బాస్ ఎలిమినేట్ చేశాడా..? అనేది మాత్రం ఈ రోజు ఎపిసోడ్ చూస్తే కానీ అర్ధం కాదు.

సంబంధిత సమాచారం :

X
More