యాంకర్ శ్రీముఖిలో ఈ యాంగిల్ కూడానా?

యాంకర్ శ్రీముఖిలో ఈ యాంగిల్ కూడానా?

Published on Nov 26, 2019 12:20 PM IST

sreemukhi7

పటాస్ కామెడీ షోతో యాంకర్ గా ఫేమస్ అయిన శ్రీముఖి ఆతరువాత అనేక టెలివిషన్ కార్యక్రమాలలో చేయడం జరిగింది. అలాగే కొన్ని సినిమాలలో అడపాదడపా కనిపించారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో పార్టిసిపేట్ చేసి రన్నర్ గా నిలిచిన ఈమె క్రేజ్ ఇప్పుడు తక్కువేం కాదు. ఈమె ఇప్పుడు నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలలో కూడా నటించనున్నారు. బిగ్ బాస్ విన్నర్ రాహుల్ అయినప్పటికీ నిర్వాహకులతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం గట్టిగానే రాబట్టినట్టు తెలుస్తుంది.

కాగా యాంకర్ మరియు యాక్ట్రెస్ గా తెలిసిన శ్రీముఖిలో మరో టాలెంట్ కూడా ఉందన్న విషయం స్టార్ మా బయటపెట్టింది. స్టార్ మా మ్యూజిక్ రీలోడెడ్ అనే ఓ కార్యక్రమం కొరకు ఆమెతో ఓ సాంగ్ పాడించారు వారు. పాట పాడటమే కాకుండా ఆ పాటకు ఎనర్జిటిక్ స్టెప్స్ కూడా వేసింది శ్రీముఖి. శ్రీముఖిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఇప్పుడూ అందరూ అనుకుంటున్నారు. ఈ పాటను శ్రీముఖి ప్రొఫెషనల్స్ కి ఏమాత్రం తగ్గకుండా పాడటం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు