మన సినిమా ఇండస్ట్రీలో నటులు దర్శకుడి అవతారమెత్తడం సర్వ సాధారణం. తాజాగా ‘అష్ట చెమ్మ’ ఫేం శ్రీనివాస్ అవసరాల డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే. అయన ప్రస్తుతం సాయి కోరపాటి నిర్మాతగా తెరకెక్కుతున్న ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
అయితే తాజా సమాచారం ప్రకారం శ్రీనివాస్ అవసరాల తన తదుపరి సినిమాలో నాగ చైతన్యను డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాకు కూడా సాయి కోరపాటి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకీ సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటివల గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో వచ్చిన ‘చందమామలో అమృతం’ సినిమాలో శ్రీనివాస్ అవసరాల హీరోగా నటించారు.


