నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై డైరెక్టర్ గా మారిన వారిలో కమెడియన్ శ్రీని అవసరాల కూడా చేరిపోయాడు. ఈ సంవత్సరం శ్రీని అవసరాల దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన సినిమా ‘ఊహలు గుసగుసలాడే’. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద హిట్ అవ్వడమే కాకుండా విమర్శకుల నుంచి కూడా శ్రీని అవసరాలకి ప్రశంశలు దక్కాయి. ఈ సినిమా సక్సెస్ తర్వాత శ్రీనివాస్ అవసరాలకి చాలా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ తను ఇంకా సెకండ్ మూవీ మొదలు పెట్టలేదు.
తాజాగా ఓ ప్రముఖ ఇంగ్లీష్ డైలీ పేపర్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలిపాడు. తన సెకండ్ సినిమా రొమాంటిక్ కామెడీ జోనర్ లో ఉండదని అన్నాడు. రొమాంటిక్ పరంగా చూపించాల్సింది మొదటి సినిమాలోనే చూపించానని, అందుకే సెకండ్ సినిమా ఆ జోనర్ లో చేయటం లేదని తెలిపాడు. శ్రీని అవసరాల నుంచి మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆశిస్తున్న అందరూ ఈ వార్త విని షాక్ అయ్యారు. శ్రీని అవసరాల తన రెండవ సినిమా కూడా సాయి కొర్రపాటి బ్యానర్లోనే చేయనున్నాడు.


