పూర్తిగా నిరాశపరుస్తున్న శ్రీనివాస కళ్యాణం !

పూర్తిగా నిరాశపరుస్తున్న శ్రీనివాస కళ్యాణం !

Published on Aug 17, 2018 8:00 PM IST


గీత గోవిందం సినిమా ప్రభావం శ్రీనివాస కళ్యాణం ఫై గట్టిగానే పడుతుంది. ఈచిత్రం యొక్క కలెక్షన్స్ రోజు రోజు కి దారుణంగా పడిపోతున్నాయి. తాజాగా ఈచిత్రం ఇప్పటివరకు తెలుగు రాష్ట్రల్లో కేవలం 10.4కోట్ల షేరును మాత్రమే రాబట్టుకోగలిగింది. దీన్ని బట్టి అర్ధంచేసుకోవచ్చు థియేటర్లలో శ్రీనివాస కళ్యాణం రన్ ఎలా సాగుతుందో.

ఇక ఈచిత్రం కంటే వారం రోజుల గ్యాప్ తో విడుదలైన గీత గోవిందం రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రల్లో10కోట్ల షేరును రాబట్టుకొని బాక్సాఫిస్ వద్ద హవా కొనసాగిస్తోంది. ‘లవర్’ చిత్రం తరువాత దిల్ రాజు చాలా ఆశలు పెట్టుకొని శ్రీనివాస కళ్యాణం ను ప్రమోట్ చేసిన ఫలితం లేకుండా పోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు