వరుస పరాజయాలతో దర్శకుడు శ్రీనువైట్ల ఇండస్ట్రీలో వెనకబడిపోయారు. 2011 లో దూకుడు చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన 2013లో బాద్షా చిత్రం తో మరో హిట్ అందుకున్నారు. ఐతే ఈ చిత్రం తరువాత ఆయన చేసిన ఆగదు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. దీనితో కొంచెం గ్యాప్ తీసుకున్న శ్రీనువైట్ల తన భవిష్యత్ ప్రణాళిక గురించి చెప్పారు.
‘ప్రేక్షకులు చాలా మారిపోయారు. మంచి కథలనే డిమాండ్ చేస్తున్నారు. ఇంకేం చేసినా అంగీకరించడం లేదు. గతంలో చాలా సినిమాల విషయంలో ఐడియాలను పట్టుకుని వెళ్లిపోయాను. వర్కవుట్ అవుతుందా? లేదా? అని ఆలోచించలేదు. ఇకపై అలాంటి తప్పులు చేయకూడదనుకున్నాను. కావాలనే బ్రేక్ తీసుకున్నా. అందుకే ఎవరికీ కనిపించలేదు. ఈ గ్యాప్‌లో మంచి కథను ఫైనలైజ్ చేశా. వచ్చే ఏడాది సినిమా ఎనౌన్స్‌మెంట్ ఉంటుంద`ని శ్రీనువైట్ల తెలిపాడు.


