శ్రీను వైట్ల అహంకారం వలనే ‘ఆగడు’ ప్లాప్ – ప్రకాష్ రాజ్.

prakesh-raj
ప్రేక్షకులు తమ విలువైన సమయం, డబ్బు ఖర్చు పెట్టి సినిమా చూడడానికి థియేటర్లకు వస్తున్నారు. వారి నమ్మకం నిలబెట్టుకోవాల్సిన భాద్యత మనపై ఉంది. ఒక సినిమా చేస్తే అందులో నటించిన నటులకు, టెక్నీషియన్లకు గుర్తింపు రావాలి. నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు రావాలి. సినిమా అనేది సమిష్టి కృషి. టీం వర్క్. కసితో సినిమా చేయాలి, కక్షతో కాదు. నేను దర్శకుడిని అనుకోవడంలో తప్పు లేదు. నేనే దర్శకుడిని అనుకోవడం అహంకారం. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో ఒక మంచి సినిమా చేయాలి. ఇతరుల మీద సెటైర్లు వేస్తె రిజల్ట్ ఇలానే ఉంటుంది. మనిషికి అహంకారం పనికిరాదు. తగ్గించుకుంటే మంచింది. అంటూ దర్శకుడు శ్రీను వైట్లపై విమర్శల వర్షం కురిపించారు ప్రకాష్ రాజ్. ‘ఆగడు’ వివాదం తర్వాత, తను ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలను సెటైరికల్ గా ‘ఆగడు’లో వాడుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంకా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ… ఆ రోజు పాత్రికేయుల సమయంలో నేను చెప్పినది పద్యం కాదు, నా ఆవేదన. ఆ మాటలను సినిమాలో వాడుకోవడానికి శ్రీను వైట్లకు సిగ్గు ఉండాలి. అతనికి నేనంటే ఇష్టం లేదు, సినిమాలో నుంచి తీసేశారు. సైలెంట్ గా ఉన్నాను. తర్వాత ప్రకాష్ రాజ్ ను మూడేళ్ళ పాటు బ్యాన్ చేయాలి, ఇండస్ట్రీ నుండి పంపేయాలి అంటూ నాటకాలు ఆడితే నా ఆవేదనను మీడియా ముందు వెలిబుచ్చాను. అది అతనికి పద్యంలా కనిపించిందా..? సినిమా ఆడలేదు కాబట్టి సరిపోయింది. అసలు సంస్కారం ఉన్న వ్యక్తి అయితే నువ్వు చెప్పిన మాటలు నాకు నచ్చాయి. నా సినిమాలో పెట్టుకుంటాను అని అడగాలి. నా అనుమతి లేకుండా వాడుకున్నాడు. కేవలం అహంకార పూరిత ధోరణి అది అని అన్నారు.

గతంలో శ్రీను వైట్ల ‘దూకుడు’ వంటి మంచి సినిమా తీశాడు. భవిష్యత్ లో మంచి మనసుతో, చక్కని కథతో తన వద్దకు వస్తే శ్రీను వైట్లతో కలసి పని చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించడం కొసమెరుపు.

Exit mobile version