మ్యూజిక్ పై శృతి ఫోకస్?

Published on Jun 1, 2020 6:59 am IST


లోకనాయకుడు కమల్ కూతురు శృతి హాసన్ తండ్రి వలె మల్టీ టాలెంటెడ్. ముఖ్యంగా సంగీతం, సింగింగ్ లో ఆమెకు ప్రావీణ్యం ఉంది. గత ఏడాది లండన్ లో కొన్ని మ్యూజిక్ కాన్సర్ట్స్ నిర్వహించింది. అప్పట్లో మైకేల్ తో ప్రేమలో ఉన్న ఆమె సినిమా కెరీర్ ని పక్కన బెట్టింది. దీనితో ఆమెకు టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో కూడా అవకాశాలు తగ్గిపోయాయి. కాగా ఈ అమ్మడు మళ్ళీ సంగీత సాధన మొదలుపెట్టిందట.

లాక్ డౌన్ కారణంగా ఎక్కడా సంగీత కచేరీలు కూడా జరపలేని పరిస్థితి. మరి ఈ అమ్మడు దేని గురించి మ్యూజిక్ పై ఫోకస్ పెట్టిందో తెలియదు. ప్రస్తుతం శృతి తెలుగులో తెలుగులో క్రాక్ మూవీలో రవితేజ సరసన నటిస్తుంది. ఈమూవీలో రవితేజ పోలీస్ పాత్ర చేస్తుండగా ఆయన భార్యగా శృతి కనిపించనుంది. దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More