‘హిట్ – 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి


టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం యంగ్ హీరోగా వరుసగా పలు విభిన్న తరహా సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్నారు అడివిశేష్. ఇటీవల పాన్ ఇండియన్ మూవీ మేజర్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ అందుకున్న శేష్, ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో చేస్తున్న మూవీ హిట్ 2. ఇటీవల రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన హిట్ 1 మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న హిట్ 2 లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై దీనిని నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే టీజర్, ఒక సాంగ్, ట్రైలర్ ఇలా అన్నిటితో ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీని ఏర్పరిచిన ఈ మూవీ యాక్షన్ తో కూడిన థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నవంబర్ 28న హైదరాబాద్ ఫిలిం నగర్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం 6 గంటల నుండి ఎంతో గ్రాండ్ గా నిర్వహించనుంది యూనిట్. కాగా ఈ ఈవెంట్ కి దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. జక్కన్న రాకతో హిట్ 2 మూవీకి ఆడియన్స్, ఫ్యాన్స్ లో మరింత క్రేజ్ పెరగడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఈ మూవీని డిసెంబర్ 2 న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు.

Exit mobile version