‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభోత్సవంలో వాళ్ళను ప్రకటిస్తారా ?

‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభోత్సవంలో వాళ్ళను ప్రకటిస్తారా ?

Published on Nov 3, 2018 10:40 AM IST

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ భారీ మల్టీస్టారర్ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు జరగనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన 34 సెకన్ల నిడివి గల వీడియోను కూడా చ్చిత్రబృందం విడుదల చేసింది. వీడియోలో.. ’11వ నెల 11వ తేదీ ఉదయం 11గంటలకు చిత్రం ప్రారంభోత్సవం కానుందని’ చిత్ర నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

ఈ సినిమాలో రాజమౌళి, ఎన్టీఆర్ ని, రామ్ చరణ్ ను సరికొత్త లుక్ లో చూపించబోతున్నాడట. అందులో భాగంగానే ఇటీవలే రాజమౌళి, ట్రైనర్ స్టీవ్స్‌ లాయిడ్‌ తో డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్లను కూడా చిత్రం ప్రారంభోత్సవం 11వ తేదీనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు