SSMB 29 : అన్నిటికి క్లారిటీ ఆరోజునే ?

SSMB 29 : అన్నిటికి క్లారిటీ ఆరోజునే ?

Published on Feb 20, 2024 11:39 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ SSMB 29 గ్రాండ్ లెవెల్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ వ్యయంతో నిర్మిస్తుండగా వి విజయేంద్ర ప్రసాద్ కథని, కీరవాణి సంగీతాన్ని అందించనున్నారు.

అయితే ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించి పలు వార్తలు గత కొన్నాళ్లుగా మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే SSMB 29 మూవీకి సంబంధించి త్వరలో మూవీ టీమ్ ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అన్నిటికీ సమాధానాలు అందిస్తుందని అప్పటి వరకు ఎటువంటి పుకార్లు నమ్మవద్దని వారి నుండి న్యూస్ వచ్చినట్లు టాలీవుడ్ లేటెస్ట్ అప్ డేట్. కాగా సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ అందరిలో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు